close

తాజా వార్తలు

Published : 23/02/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

#చిరు152 లుక్‌ లీక్‌

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ షూటింగ్‌ ఫొటో

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరంజీవిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్‌ ఒకటి నెట్టింట్లో లీక్‌ అయ్యింది. ఇందులో చిరు మెడలో ఎర్ర కండువా ధరించి కనిపించారు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి లుక్ చూసిన అభిమానులు.. వివిధ సందర్భాల్లో మెగా హీరోలు ఎర్ర కండువాతో ఉన్న లుక్స్‌ను యాడ్‌ చేసి నెట్టింట్లో పలు ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.

దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో చిరు-కొరటాలశివ సినిమా ఉండబోతోందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట. ఇందులో చిరుకి జంటగా త్రిష సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.