close

తాజా వార్తలు

Updated : 09/03/2020 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2000 పాయింట్లకు పైగా దిగజారిన సెన్సెక్స్‌

ముంబయి: జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సమయం గడుస్తున్న కొద్దీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,316 పాయింట్లు నష్టపోయి 35,260 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 643 పాయింట్లు దిగజారి 10,346 వద్ద కొనసాగుతోంది. గత 16 సెషన్లలో 13 సెషన్లు మార్కెట్లు నష్టపోవడం గమనార్హం. ఈ ఒక్కరోజే దాదాపు రూ.6.8 లక్షల కోట్లకు పైగా మదుపర్ల  సంపద ఆవిరైపోయింది. మార్కెట్ల చరిత్రలో ఇదొక బ్లాక్‌ మండేగా మిగిలిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి మదుపర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. మరోవైపు ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, ఒపెక్‌ మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చాయి. దీంతో చమురు ఆధారిత సంస్థల షేర్లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. అలాగే యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో సీబీఐ సోదాలు చేపట్టడం.. రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం వంటి పరిణామాలు దేశీయ మదుపర్లను నిరాశకు గురిచేశాయి. దీంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

ఓ దశలో ఓఎన్‌జీసీ 15శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 13శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.5శాతం, టాటా స్టీల్‌ 7శాతం నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 4శాతం నష్టాలతో లోహరంగం అత్యధిక నష్టాల్ని మూటగట్టుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.