close

తాజా వార్తలు

Updated : 19/03/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనాలో తగ్గుముఖం.. ఇతర దేశాల్లో ఉద్ధృతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 157 దేశాల్లో మరణించిన వారి సంఖ్య 8,809కి చేరుకుంది. కాగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 2,18,631కు చేరినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం పరిశీలన వెల్లడించింది.

ఇద్దరు యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులకు కరోనా

అమెరికాలో ఇప్పటి వరకు 8,736 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 149కి చేరినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఇద్దరు యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులకు కూడా ఈ వ్యాధి సోకినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్‌లో అత్యధికంగా 2,900, వాషింగ్టన్‌లో 1,187 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వైరస్‌ ప్రభావం కారణంగా ఇమ్మిగ్రాంట్‌, నాన్‌ ఇమ్మిగ్రాంట్‌ వీసా అపాయింట్‌మెంట్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎంబసీలకు తెలియజేసింది.

దక్షిణ కొరియాలో అత్యవసర ఆర్థిక సాయం
దక్షిణ కొరియాలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో అక్కడ చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ అత్యవసర సాయంగా 39 బిలియన్‌ డాలర్లు ప్రకటించారు. దక్షిణ కొరియా 8,565 మంది కరోనావైరస్‌ బారిన పడగా.. 91 మంది కన్నుమూశారు.

జపాన్‌లో 33కు చేరిన మృతులు
జపాన్‌లోనూ కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. జపాన్‌ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 976కు.. మృతుల సంఖ్య 33కు చేరింది. టోక్యో ఒలంపిక్స్‌ చీఫ్‌ యోషిరో మోరి మార్చి 10న జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు హాజరైన కమిటీ డిప్యూటీ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు.

ఇటలీలో ఒకే రోజు 475 మంది మృతి
చైనాలో మొదలైన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇతర దేశాలతో పోలిస్తే.. వైరస్‌ ప్రభావం ఇటలీని మరింత తీవ్రంగా కలచివేస్తోంది. గడిచిన 24 గంటల్లో  అత్యధికంగా 475 మరణాలు సంభవించాయి. ఈ మేరకు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్‌ కారణంగా ఒకే రోజులో ఇంత ఎక్కువ మరణాలు సంభవించిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. కొత్తగా మరణించిన 475 మందితో కలిపి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,978కి చేరినట్లు తెలిపారు. మృతుల సంఖ్య దాదాపు 19శాతం పెరిగినట్లు వెల్లడించారు. కాగా ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 35,713కు చేరింది. 

చైనాలో నిన్న ఒక్క కేసూ నమోదు కాలేదు
చైనాలో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గు ముఖం పట్టింది. బుధవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘చైనాలో అంతర్గతంగా బుధవారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 34 కేసులు కొత్తవి నమోదయ్యాయి.. కానీ వారంతా విదేశాల నుంచి చైనాకు చేరుకున్న వారే. వాటిలో 21 బీజింగ్‌లో, మరో రెండు షాంఘై, 9 కేసులు గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్సుల్లో నమోదయ్యాయి’అని ఎన్‌హెచ్‌సీ అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే వైరస్‌ సోకిన వారిలో బుధవారం మరో 8మంది మృతి చెందారు. చైనాలో ఇప్పటి వరకు మొత్తం నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 80,928కి చేరింది. మొత్తం 3,245 మంది మృతి చెందారు.

ఇరాన్‌లో అంతకంతకూ పెరుగుతున్న మృతులు
చైనా తర్వాత కోరోనా అత్యధికంగా ప్రభావం చూపుతున్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఇక్కడ ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,135 మంది మృతి చెందగా.. మొత్తం 17,361 కేసులు నమోదయ్యాయి.
 కోస్టా రికాలో తొలి మరణం:
కోస్టారికా దేశంలో కరోనా కారణంగా తొలి వ్యక్తి మరణించారు. 87ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌ కారణంగా మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశం బాధితులు మృతులు
చైనా 80,928 3,245
ఇటలీ 35,713 2,978
ఇరాన్‌ 17,361 1,135
స్పెయిన్‌ 14,769 638
జర్మనీ 12,327 28
యూఎస్‌ఏ 9,464 155
ఫ్రాన్స్‌ 9,134 264
దక్షిణ కొరియా 8,565 91
స్విట్జర్లాండ్‌ 3,115 33
యూకే 2,626 104
నెదర్లాండ్స్‌ 2,051 58
భారత్‌ 169 3

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.