close

తాజా వార్తలు

Published : 19/05/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1,100 మంది ఉద్యోగుల తొలగింపు: స్విగ్గీ

దిల్లీ: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు చాలా సంస్థలు ఉద్యోగాలు/వేతన కోతలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో 13 శాతం ఉద్యోగాల (500 పైచిలుకు) కోత ప్రకటించిన 3 రోజుల వ్యవధిలోనే ఇదే రంగంలో కొనసాగుతున్న మరో సంస్థ స్విగ్గీ కూడా 1,100 మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు సోమవారం వెల్లడించింది. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా ఈ సమాచారం తెలిపినట్లు సమాచారం. ‘స్విగ్గీకి ఈ రోజు చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే మనం ఉద్యోగుల్ని తగ్గించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింద’ని ఆయన ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు పనిచేసిన ప్రతి ఏడాదికి నెల చొప్పున .. 3-8 నెలల వేతనం పరిహారంగా అందిస్తామని, వారితో పాటు కుటుంబ సభ్యులకు 2020 డిసెంబరు 31 వరకు వైద్య బీమా కవరేజీ కొనసాగిస్తామని, అదనంగా వారి తల్లిదండ్రులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తామని స్విగ్గీ పేర్కొంది. ప్రమాద, టర్మ్‌ బీమా కూడా ఈ ఏడాది ఆఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది. దీంతోపాటు సదరు ఉద్యోగులు తమ వృత్తి మార్చుకునేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు అవసరమైన మద్దతు కూడా ఇస్తామని సంస్థ వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.