close

తాజా వార్తలు

Updated : 29/05/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

11 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

దిల్లీ: భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. 2019 - 20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 3.1గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 4.2శాతంగా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.1గా ఉన్న జీడీపీ వృద్ధిరేటు తదుపరి ఆర్థిక సంవత్సరం  4.2గా నమోదైంది. కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం భారత్‌పైనా పడింది. ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్‌లో మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.