గాంధీ విగ్రహ అపవిత్రంపై స్పందించిన ట్రంప్‌
close

తాజా వార్తలు

Updated : 09/06/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాంధీ విగ్రహ అపవిత్రంపై స్పందించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ఇటీవల జరిగిన జాత్యహంకార వ్యతిరేక నిరసనల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేయడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. వైట్‌ హౌస్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబారి కార్యాలయం వెలుపల మహాత్మాగాంధీ విగ్రహాన్ని జూన్‌ 2న అర్ధరాత్రి దుండగులు అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. ఆఫ్రో అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌.. పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోవడంపై వ్యక్తమైన ఆందోళనల్లో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహంపై రాతలు రాసి, నల్లరంగు పులిమారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం.. అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 

ఫిబ్రవరిలో భారత పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఆయన సతీమణి మెలనియాతో కలిసి సబర్మతీలోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు గాంధీ ఉపయోగించిన రాట్నాన్ని పరిశీలించి.. దాని పనితీరును ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు వైట్‌ హౌస్ గోడలపై కూడా కనిపించాయి.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని