భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 25/06/2020 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 సమయంలో సెన్సెక్స్‌ 343 పాయింట్లు కోల్పోయి 34,525 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 10,235 వద్ద ట్రేడవుతున్నాయి.  దేశంలో ఆన్‌లాక్‌ కారణంగా  కరోనావైరస్‌ కేసులు నానాటికీ పెరిగిపోతుండటం మార్కెట్ల పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు నేడు జూన్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ జీడీపీ ఏప్రిల్‌లో అంచనావేసిన దానికంటే ఎక్కువగా పతనం కానుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది. ఈ విషయం కూడా మార్కెట్లను భయపెట్టింది. ఇక భారత్‌ వృద్ధిరేటు కూడా 4.5శాతం పతనం కానుందని అంచనావేసింది. ఇది భారత్‌ చరిత్రలోనే అత్యల్పం. నేడు 147 కంపెనీలు కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో అపోలో హాస్పటల్స్‌, అశోక్‌లేల్యాండ్‌, బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి. 
అంతర్జాతీయ అంశాల ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. అమెరికాలోని డోజోన్స్‌ సూచీ 2.72శాతం పతనం కాగా.. ఎస్‌అండ్‌పీ 500 2.59శాతం విలువ కోల్పోయింది. నాస్‌డాక్‌ 2.19శాతం పడిపోయింది.  దీంతో నేటి ఉదయం జపాన్‌ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  జపాన్‌ సూచీ నిక్కీ 1.38శాతం , దక్షిణ కొరియా సూచీ కేవోఎస్‌పీఐ 1.72శాతం  పడిపోయాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని