close

తాజా వార్తలు

Published : 01/07/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌@ 9 PM

1. ICC: పదవి నుంచి వైదొలగిన శశాంక్‌ మనోహర్‌

ఐసీసీ ఛైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ దిగిపోయారని ఐసీసీ ప్రకటించింది. రెండేళ్లు, రెండు పర్యాయాలు ఆయన ఛైర్మన్‌గా పనిచేశారని తెలిపింది. మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా నిర్వహిస్తారని వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఆరంభమవుతుందని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండిస్తున్నాం’

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు డిశ్ఛార్జిని ఖండిస్తున్నామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జిపై  చంద్రబాబు స్పందించారు. ‘‘ప్రభుత్వ ఒత్తిడితో డిశ్ఛార్జి‌ చేయడాన్ని ఖండిస్తున్నాను. డిశ్ఛార్జి‌ చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడం గర్హనీయం. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పిచండం శోచనీయం. సాయంత్రం ఐదు తర్వాత 4.20 సమయం వేసి డిశ్ఛార్జి చేయడం దుర్మార్గం’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. చైనా కంపెనీలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి సాధ్యమైన మార్గాలన్నింటిని భారత్ అన్వేషిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోనిదే. జాయింట్‌ వెంచర్లతో సహా రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని అనుమతించమంటూ బుధవారం ఆయన స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. లాల్‌బాగ్చా రద్దు: 87 ఏళ్లలో తొలిసారి

హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో.. ముంబయి వాసులకు ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతీ అంతే! కానీ, కరోనా ప్రభావం ఆయన మీద కూడా పడింది. ఈసారి లాల్‌బాగ్చా రాజా ఉత్సవాలకు అక్కడి ప్రజలు దూరం కానున్నారు. వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది లాల్‌బాగ్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు నిర్ణయించారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 60 శాతానికి చేరువగా కరోనా రికవరీ రేటు!

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిజానికి గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ దాదాపు 19వేల కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటికి మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 5,85,493కి చేరింది. అయితే సంఖ్యను చూసి ఆందోళనకు లోను కానవసరం లేదని... వారిలో 3,47,979 మంది కోలుకున్న విషయాన్ని గమనించాలని పరిశీలకులు అంటున్నారు. జులై 1, 2020 నాటికి సుమారు 60 శాతం రికవరీ కావటం సానుకూల పరిణామం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కొత్త షోకి రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

అమెజాన్‌ ప్రైమ్‌తో భారతీయ నటి ప్రియాంకా చోప్రా భారీ ప్రాజెక్టు కోసం సంతకం చేశారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ కోట్లాది రూపాయల విలువ గల ఒప్పందం ద్వారా.. ఈ మాజీ మిస్‌ వరల్డ్‌, అంతర్జాతీయ బుల్లి తెరపై మరోసారి కనిపించనున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ టీవీ కార్యక్రమాల్లో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని ప్రియాంక తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ర‌క్త ప‌రీక్ష‌తో వైర‌స్‌ తీవ్ర‌త అంచ‌నా!

ప‌్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి ఇప్ప‌టివ‌ర‌కు క‌చ్చిత‌మైన‌ చికిత్స లేదు. కేవ‌లం ల‌క్ష‌ణాల‌క‌నుగుణంగా చికిత్స మాత్ర‌మే జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ సోకి తీవ్ర‌మైన అనారోగ్యానికి గురయ్యేవారిని ముందుగానే గుర్తించ‌వ‌చ్చ‌ని తాజా ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. క‌రోనా సోకిన రోగుల ర‌క్తా‌న్ని ప‌రీక్షించ‌డం ద్వారా వెంటిలేట‌ర్ అవ‌స‌ర‌మ‌య్యే అంశాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ వ‌ర్జీనియా శాస్త్రవేత్త‌ల తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పాకిస్థాన్ విమానాల‌ను నిషేధించిన యూర‌ప్!

పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌‌పై ఆరు నెల‌ల‌పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ వెల్ల‌డించింది. పాకిస్థాన్లో ఎక్కువ‌శాతం పైలట్లు న‌కిలీ లైసెన్సులు క‌లిగిఉన్నార‌ని తేల‌డంతో ప‌లు పాక్‌ విమాన‌యాన సంస్థ‌ల‌పై నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వరుడి కుటుంబానికి రూ.6.26 లక్షల జరిమానా

రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లాలో జరిగిన ఓ వివాహం వరుడి కుటుంబానికి భారీ జరిమానా పడేలా చేసింది. పెళ్లిలో నియమ నిబంధనలు పాటించకుండా పలువురికి కరోనా సోకేలా వ్యవహరించిన కారణంగా రూ.6.26 లక్షల జరిమానా కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రోగులు, క్వారంటైన్‌లో ఉన్నవారి ఖర్చులు భరించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ విషయం వెల్లడిస్తే జిన్‌పింగ్‌ సీటుకే ఎసరు?

గల్వాన్‌ ఘర్షణలో అమరులైన జనాన్ల సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. వారి త్యాగాన్ని యావత్తు దేశం కొనియాడింది. రాష్ట్ర ప్రభుత్వాలు వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచాయి. కానీ, చైనా మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు చనిపోయినట్లు కూడా అధికారికంగా అంగీకరించలేదు. దాదాపు 44 మంది మృతిచెంది ఉంటారని మన వర్గాలు అంచనా వేశాయి. అయితే, ఈ విషయాన్ని అంగీకరిస్తే షీ జిన్‌పింగ్‌ సీటుకు ఎసరు తప్పదని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 2030 వరకు మోదీయే ప్రధాని: రామ్‌మాధవ్‌

కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో భాజపా జన సంవాద్‌ వర్చువల్‌ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, కరోనా నివారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గురించి ఆయన విమర్శించారు. 2030 వరకు ప్రధానిగా మోదీయే కొనసాగుతారని రామ్‌మాధవ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.