రొస్సారి బయోటెక్ ఐపీవో రేపే ..!
close

తాజా వార్తలు

Published : 12/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రొస్సారి బయోటెక్ ఐపీవో రేపే ..!

ముంబయి: రసాయనాల తయారీ సంస్థ రొస్సారి బయోటెక్‌ ఐపీవో రేపటి నుంచి మొదలు కానుంది. ఈ ఐపీవో విలువ రూ.500 కోట్లుగా అంచనావేస్తున్నారు.  దీనిలో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.423 నుంచి రూ.425 మధ్యలో అంచనావేస్తున్నారు. జులై 15 వరకు బిడ్డింగ్‌లను స్వీకరిస్తారు.  కంపెనీ ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో రూ. 50 కోట్ల విలువైన 1,05,00,000 షేర్లను కూడా విక్రయించనున్నారు. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 95శాతం నుంచి 73శాతానికి తగ్గనుంది. 

ఈ ఐపీవో ముగిసిన తర్వాత జులై 23వ తేదీన ఈ  షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్‌కానున్నాయి.  యాక్సెస్‌ క్యాపిటల్‌‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ ఐపీవోకు మర్చెంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.  దీని ద్వారా సమీకరించే నిధులతో రుణాల చెల్లింపు, మూలధన అవసరాలను పూర్తి చేసుకోవడానికి వినియోగించుకోనున్నారు.  రొస్సారి బయోటెక్‌ హోమ్‌, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలను , వస్త్రపరిశ్రమకు అవసరమైనవి కూడా తయారు చేస్తుంది. దాదాపు 17 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని