close

తాజా వార్తలు

Updated : 07/06/2020 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుమ డ్యాన్స్‌.. ఎక్కడికైనా వెళ్లిపోతా అంటోన్న సోనమ్‌..!

వైరల్‌గా మారిన వీడియో, ఫొటోలు

హైదరాబాద్‌: బన్నీ సినిమాలోని ‘రాములో రాములా’ పాటకు యాంకర్‌ సుమ సరదాగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు పలు వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. దానికి సంబంధించిన పలు వీడియోలను, ఫొటోలను సైతం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెలబ్రిటీ వాల్స్‌పై ఏం ఉందో ఓ లుక్కేయండి..!

‘నా బ్యాగ్స్‌ అన్నీ సర్దేసుకున్నా. ప్రయాణం చేయడానికి  సిద్ధంగా ఉన్నా. ఎక్కడికైనా సరే..! ఐ మిస్‌ ట్రావెలింగ్‌’ అంటూ సోనమ్‌ ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు దిగిన పలు ఫొటోలను షేర్‌ చేసి.. తనకి ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టమని మీనా తెలియజేశారు. మహేశ్‌ కుమార్తె సితార మొట్టమొదటి సారి మంచుతో సరదాగా ఆడుకున్న ఓ మధుర జ్ఞాపకాన్ని నమ్రత షేర్‌ చేయగా... సెట్‌లో దిగిన ఓ పాత ఫొటోను కృతిసనన్‌ పోస్ట్ చేశారు. అనసూయ సైతం తన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.








 












Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని