ప్రేమజంట బలవన్మరణం
close

తాజా వార్తలు

Updated : 20/10/2020 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమజంట బలవన్మరణం

అచ్చంపేట పట్టణం, బల్మూర్‌: తమ వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించరన్న బెంగతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్‌ మండలం బిల్లకల్లుకు చెందిన అఖిల(19), ఇదే మండలంలోని చెంచుగూడెంకు చెందిన నిమ్మల అనిల్‌(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇటీవల యువతి ఇంట్లో తెలియడంతో తల్లి మందలించింది. ఈ విషయాన్ని అఖిల అనిల్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో అనిల్‌.. అఖిల గ్రామానికి ఆదివారం రాత్రి వెళ్లి ఆమెను తీసుకెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున 4.40 గంటలకు అనిల్‌ తన స్నేహితుడికి ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. దీంతో వారి కోసం అడవిలో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం అటువైపు వెళ్లిన పశువుల కాపరి బిల్లకల్‌ సమీపంలోని రుషులచెరువు అటవీశాఖ బేస్‌క్యాంపు వెనకనున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంటను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని