
తాజా వార్తలు
యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి
ట్విటర్లో త్రీడీ యానిమేటర్ వీడియోలను ఉంచిన ప్రధాని
దిల్లీ : కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో యోగా చేయటం ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. యోగా విత్ మోదీ పేరుతో త్రీడీ యానిమేటర్ వీడియోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. తన ఫిట్నెస్ గురించి ‘మన్కీబాత్’లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోదీ ఈ పోస్టు పెట్టారు. తాను యోగా గురువును కాదని కేవలం అభ్యాసకుడిని మాత్రమేనని పేర్కొన్నారు. యోగా వల్ల తాను ఎంతో ప్రయోజనం పొందినట్లు తెలిపారు. ఈ వీడియోలను చూసి ప్రజలు యోగా ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags :