మావోయిస్టుకు పోలీసుల రక్తదానం!
close

తాజా వార్తలు

Published : 30/05/2020 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మావోయిస్టుకు పోలీసుల రక్తదానం!

దిల్లీ: గాయపడి, ప్రమాదకర స్థితిలో ఉన్న మావోయిస్టుకు పోలీసులు తమ రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటే ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... ఇటీవల పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలోని అడవుల్లో మావోయిస్టులపై సీఆర్‌పీఎఫ్‌ దళాలు, పోలీసులు సంయుక్తంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, ఇద్దరు పట్టుబడ్డారు. వారిలో ఒకరు గాయాల కారణంగా చాలా రక్తం కోల్పోయారని, అతనికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని టాటానగర్‌లోని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఈ పరిస్థితిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు ముందుకొచ్చి... గాయపడిన మావోయిస్టుకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిలో ఒకరైన 36 ఏళ్ల ఓం ప్రకాశ్‌ యాదవ్ ‌‘‘వారు మా పైకి తుపాకులు ఎక్కుపెడతారని నాకు తెలుసు. అలాగే మేము కూడా వారిపై దాడులు చేస్తాము... అయితే మానవత్వం అన్నిటికంటే ఉన్నతమైనది. ఒక మనిషిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.’’ అని తెలిపారు. తాను గతంలో కూడా అనేకసార్లు రక్తదానం చేశానని, తోటిమనిషిని కాపాడేందుకు మనిషి చేయగల అమూల్యమైన సహాయంగా దీనిని భావిస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా, సందీప్‌ కుమార్‌ అనే మరో ఉద్యోగి.. ‘‘తుపాకులతో కాల్చటం, చంపటం మా విధి నిర్వహణలో భాగం... అదేవిధంగా ప్రాణాలను కాపాడటం కూడా మా కర్తవ్యమే.’’ అని తెలిపారు. కర్తవ్య నిర్వహణలో, ప్రాణాలు కాపాడటంలో కూడా చక్కని అంకితభావాన్ని ప్రదర్శించారని రక్తదానం చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని