
తాజా వార్తలు
ప్రాణాలకు తెగించి..వెలుగులు అందించి..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొటాల హరిజనవాడ వద్ద భీమా నది ఒడ్డున ఏర్పాటు చేసిన 33కేవీ విద్యుత్తు స్తంభం వరద తాకిడికి గురువారం నేలకూలటంతో సుమారు 25 గ్రామాల్లో అంధకారం అలముకుంది. అప్రమత్తమైన ఆ శాఖ ఉన్నతాధికారులు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భీమా నది మధ్యలో వేలాడుతున్న విద్యుత్తు తీగలకు మరమ్మతులు చేసేందుకు అందరూ వెనుకంజ వేయగా ఎ.రంగంపేట విద్యుత్తు ఉపకేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగార్జున ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. నడుముకు తాడు కట్టుకుని విద్యుత్తు తీగలకు వేలాడుతూ అక్కడకెళ్లి తీగలకు మరమ్మతులను పూర్తిచేశారు.
- న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణం
Tags :
జనరల్
జిల్లా వార్తలు