
తాజా వార్తలు
భార్గవరామ్ మహారాష్ట్రకు.. శ్రీను కర్ణాటకకు
ప్రవీణ్‌రావు సోదరులను వదిలేసి పరారీ
కిడ్నాప్ ఉదంతంపై కచ్చితమైన సమాచారంతో పోలీసుల గాలింపు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్‌టుడే, నారాయణగూడ, కంటోన్మెంట్: ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ ఉదంతంలో సూత్రధారులైన భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న హైదరాబాద్ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. భార్గవరామ్ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. అనంతరం వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్ దాటి పారిపోయారు. అనంతరం కొన్ని గంటలపాటు భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఫోన్లలో మాట్లాడుకున్నాక పోలీసులకు దొరకకూడదని తమ సిమ్‌కార్డులను పారేశారు. సాంకేతిక ఆధారాలతో వీరిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు.
కారులోనే ఉన్నారా? ఇంట్లోకి వచ్చారా?
కిడ్నాప్ వ్యవహారాన్ని ఆద్యంతం పర్యవేక్షించిన భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన రోజు కారులో ఉన్నారా? ప్రవీణ్‌రావు ఇంట్లోకి వచ్చి అపహరించుకెళ్లారా? అన్న అంశాలపై పోలీసులు తాజాగా పరిశోధిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన రోజు వారిద్దరూ ఒకే కారులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. భార్గవరామ్, అఖిలప్రియలు ఉపయోగిస్తున్న కార్లు, కిడ్నాపర్లు వినియోగించిన కార్ల నంబర్లను విశ్లేషించాక ఈ నిర్ణయానికి వచ్చారు. అపహరణ ఉదంతం ముందు రోజు వీరిద్దరూ కూకట్పల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాల్లో ఒకే కారులో సంచరించారని తెలుసుకున్నారు. వీరిద్దరి కారు ప్రయాణ మార్గం ట్రాఫిక్ కూడళ్లలోని నాలుగైదు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. ఆ సమయంలో భార్గవరామ్ మాస్కు ధరించకపోవడంతో పోలీసులు సులభంగా గుర్తించారు. ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చిన కార్లలో కాకుండా మరో కారులో భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఉన్నట్లు ఆధారాలున్నా, వారు ప్రవీణ్‌రావు ఇంట్లోకి వెళ్లారా? లేదా? అన్న అంశంపై స్పష్టత రాలేదు.
2 రోజుల్లో నిందితులందరినీ అరెస్టు చేస్తాం: సీపీ అంజనీకుమార్
ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కీలక నిందితులు సహా మిగిలిన వారందరినీ రెండు రోజుల్లో అరెస్టు చేస్తాం. భూమా అఖిలప్రియ కస్టడీ గురువారం మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచాక తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తాం.
ఆళ్లగడ్డకు తెలంగాణ పోలీసులు
కర్నూలు డిజిటల్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు రెండు వాహనాల్లో వచ్చిన తెలంగాణ పోలీసులు భూమా కుటుంబ కారు డ్రైవరుగా ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాకు తెలిసింది ఇంతే... ఇంకేమీ అడగొద్దు
పోలీసుల ఆధీనంలో ఉన్న భూమా అఖిలప్రియ పోలీసుల ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలివ్వడం లేదని తెలిసింది. ‘నాకు తెలిసింది ఇంతే. ఇంకేమీ అడగొద్దు’ అంటూ చెప్పినట్టు సమాచారం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
