
తాజా వార్తలు
మాస్కులు లేవా.. గుంజీలు తీయండి!
గూడూరు: ‘మాస్కులు లేకుండా వీధుల్లో తిరుగుతున్నారా! అయితే గుంజీలు తీయండి’ అంటూ గూడూరు నగరపంచాయతీ కమిషనరు ప్రహ్లాద్, ఎస్సై నాగార్జున స్థానికుల్ని హెచ్చరించారు. నగర పంచాయతీలో కరోనా కేసులు పెరగడంతో ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఆదివారం పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించారు. వీధుల్లోకి మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వచ్చిన వారికి శిక్షగా గుంజీలు తీయించారు.
Tags :