AP News: నలుగురికి ఎమ్మెల్సీ అవకాశం

తాజా వార్తలు

Updated : 11/06/2021 07:17 IST

AP News: నలుగురికి ఎమ్మెల్సీ అవకాశం

ఈనాడు, అమరావతి: ఏపీలో శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను (గవర్నర్‌ కోటా) భర్తీ చేసేందుకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు తెలిసింది. శుక్ర లేదా శనివారం గవర్నర్‌ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్‌యాదవ్‌ (కడప ), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి) ఉన్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని