Corona: పడకలా? వినపడలె!
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పడకలా? వినపడలె!

ఆసుపత్రుల్లో ఖాళీలపై కంట్రోల్‌ రూం మౌనం

అంబులెన్సుల్లోనే కుంగిపోతున్న బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌

‘‘ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. వెంటనే ఆక్సిజన్‌ వసతి, ఐసీయూ ఉన్న ఆస్పత్రిలో చేరాలి. పడకలు ఏ దవాఖానాలో ఉన్నాయో చెప్పండంటూ’’ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు నిత్యం 100 మంది బాధితులు ఫోన్‌ చేస్తున్నారు. ఆ సమాచారం మా వద్ద లేదంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లోనూ అస్పష్ట సమాచారం ఉంటోందని, ఫలితంగా దవాఖానాల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈలోగా తమవారు చనిపోతున్నారని కొందరు వాపోతున్నారు. పడకల విషయంలో వైద్యారోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నారు.

అప్పటి సేవలేవి?

కొవిడ్‌ మొదటి దశ లాక్‌డౌన్‌ సమయంలో జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం సేవలను ప్రారంభించింది. అప్పట్లో ఇన్ని కేసులు లేకపోయినా పలు రకాల సేవలందించారు. అంబులెన్సుల్లో బాధితులను ఆస్పత్రుల్లో చేర్చారు. పడకలు ఇప్పించారు. హోం ఐసొలేషన్‌లోని వారికి మందులు అందించారు. వైద్య ఆరోగ్యశాఖతో కలిసి రోగుల ఆరోగ్య స్థితిగతులను నిత్యం పర్యవేక్షించారు. క్వారంటైన్‌ సమయం పూర్తయ్యాక మళ్లీ పరీక్షలు చేయించారు. వీటి కోసం నిత్యం 500కు పైగా ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు ఆ సేవలన్నీ అటకెక్కాయి. కేవలం టీకాలు ఎక్కడెక్కడ వేస్తున్నారు, కొవిడ్‌ పరీక్ష కేంద్రాలెక్కడ అనే సమాచారంతోపాటు కొవిడ్‌ లక్షణాల గురించి స్పష్టత ఇచ్చేందుకు వైద్యుల సూచనలనే కంట్రోల్‌రూం అందిస్తోంది. దీంతో ఫోన్ల రాక 200కు పడిపోయింది. సగం మంది పడకల గురించి అడుగుతున్నా సమాచారం ఇవ్వకపోవడం వల్ల కంట్రోల్‌ రూం ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు.

సమన్వయంతో నడవాలి

వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసులు సమన్వయంతో కంట్రోల్‌ రూంను నడిపించాలని, ప్రతి గంటకు పడకల లభ్యత సమాచారం సేకరించి పౌరులకు అందించే వ్యవస్థను అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. బాధితులకు అందించలేకపోతున్న సేవల గురించి, ఆ సమయంలో వారు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సేవలను మెరుగుపరిచేలా చూస్తే బాగుంటుందంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న https://health.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ఆధారంగా ప్రభుత్వ దవాఖానాలను పడకల కోసం సంప్రదిస్తున్న వారికి అస్పష్టమైన సమాచారం అందుతుందని గుర్తుచేస్తున్నారు.

ఐసొలేషన్‌ పడకలున్న ప్రభుత్వాసుపత్రులు

మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆస్పత్రి(8374954545), రామంతాపూర్‌ హోమియోపతి వైద్యశాల(9849789222), బేగంపేట ప్రకృతి చికిత్సాలయం, పాతబస్తీలోని నిజామియా టీబీ ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి.

ఇవిగో జిల్లాల వారీగా ఆసుపత్రుల వివరాలు

* హైదరాబాద్‌: గోల్కొండ(9440938674), మలక్‌పేట(9866244211), నాంపల్లి(8008553888) దవాఖానాల్లో ఆక్సిజన్‌ పడకలున్నాయి. ఆక్సిజన్‌తోపాటు, ఐసీయూ ఉన్నవి.. ఛాతీ ఆస్పత్రి (9949216758), కింగ్‌ కోఠి (ఫఫ8008553882), ఈఎస్‌ఐ ఆస్పత్రి (7702985555), గాంధీ దవాఖానా(9392249569, 7989085425), తిరుమలగిరి ఆర్మీ ఆస్పత్రి(7889529724), నిలోఫర్‌(9440612599), నిమ్స్‌ (9490296073), ఉస్మానియా(9849902977), లాలాగూడ రైల్వే(9701370514), ఫీవర్‌ ఆస్పత్రి (9347043707). ఉస్మానియా ఆస్పత్రిలో బయటి కొవిడ్‌ రోగులకు చికిత్స ఉండదని వైద్యులు చెబుతున్నారు.

* రంగారెడ్డి జిల్లాలో.. కేవలం ఆక్సిజన్‌ పడకలు ఉన్న ఆస్పత్రుల్లో వనస్థలిపురం(8008553912), చేవెళ్ల(8008553862), హయత్‌నగర్‌, మహేశ్వరం(9573930010), రాజేంద్రనగర్‌(8008553865), షాద్‌నగర్‌(8328167440) దవాఖానాల్లో కేవలం ఆక్సిజన్‌ పడకలున్నాయి. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రి(9440061197), గచ్చిబౌలి టిమ్స్‌(9494902900, 040-23121000, 29567606) ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలున్నాయి.

* మేడ్చల్‌ జిల్లాలో.. మల్కాజిగిరి(9849472191, 6303720053), ఘట్‌కేసర్‌(8008553861) ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని