close

తాజా వార్తలు

Published : 02/03/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విచారణ తర్వాతే వివాదాల పరిష్కారం: హైకోర్టు

హైదరాబాద్‌: రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ ట్రైబ్యునళ్లు వివాదాలను తేలుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వివాదాలకు సంబంధించి ఇరువైపుల వాదనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఇప్పటివరకు విచారణ లేకుండా రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసులు, పెండింగ్‌ కేసుల వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాల వారీగా ట్రైబ్యునళ్లలో ఉన్న పెండింగ్‌ కేసులు, పరిష్కరించినవి.. బదిలీ చేసిన కేసుల వివరాలతో కూడిన నివేదికను ఈనెల18లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. రెవెన్యూ అధికారుల వద్దనున్న పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ చేసినట్లు చెప్పారు. బదిలీ అయిన వాటిలో ఎక్కువశాతం కేసులు పరిష్కారమయ్యాయన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని