భారత్‌-చైనా పదకొండోసారి..!
close

తాజా వార్తలు

Published : 09/04/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-చైనా పదకొండోసారి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనా దేశాల మధ్య పదకొండో విడత సైనికాధికారుల స్థాయి చర్చలు మొదలయ్యాయి. లద్దాఖ్‌‌లో హాట్‌స్ప్రింగ్స్‌,గోగ్రా,డెప్సాంగ్‌లో ఉద్రిక్తతలను కూడా తగ్గించుకొనే లక్ష్యంతో వీటిని మెదలు పెట్టారు. నేటి ఉదయం 10.30 సమయంలో భారత్‌ వైపు చుషూల్‌ సెక్టార్‌లో చర్చలను ప్రారంభించారు.

ఇప్పటికే జరిగిన 10విడత చర్చల్లో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ, ఉత్తర ఒడ్డుపైన బలగాలు ఉపసంహరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 16 గంటలపాటు చర్చలు జరిగాయి. ఇక నేడు జరుగుతున్న చర్చల్లో  భారత్‌ తరఫున 14వ కోర్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ నేతృత్వం వహిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా బలగాల ఉపసంహరణ జరగాలని భారత్‌ ఈ చర్చల్లో కోరనుంది. గత నెలలో ఆర్మీ జనరల్‌ ఎంఎం నరవాణే మాట్లాడుతూ ‘‘పాంగాంగ్‌ వద్ద బలగాల ఉపసంహరణతో భారత్‌కు ముప్పు తగ్గింది.. కానీ, పూర్తిగా మాయమైపోలేదు’’ అని పేర్కొన్నారు.

మే5న గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ అనంతరం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న అనంతరం జ‌రిగిన ప‌రిణామాలతో సరిహ‌ద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బ‌ల‌గాలు వెన‌క్కి త‌గ్గాయి. ఇరుదేశాల పదోవిడత కోర్‌ క‌మాండ‌ర్ స్థాయి అధికారులు జ‌రిపిన‌ చ‌ర్చ‌లు పురోగ‌తి సాధించ‌డంతో స‌రిహ‌ద్దు‌ నుంచి ఇరు పక్షాలు బలగాలను ఓ క్రమపద్దతిలో వెనక్కి పిలిపించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని