7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు 
close

తాజా వార్తలు

Updated : 23/10/2020 10:35 IST

7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు 

దిల్లీ : దేశంలో వరుసగా ఐదో రోజూ కరోనా పాజిటివ్‌ కేసులు 60 వేల లోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,42,722 పరీక్షలు నిర్వహించగా..54,366 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. తాజాగా 690 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,17,306కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 73,979 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 69,48,497గా ఉంది. ఇక దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షలకు దిగువకు వచ్చింది. ప్రస్తుతం 6,95,509 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 89.53 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని