
తాజా వార్తలు
93.65 శాతానికి చేరిన రికవరీ రేటు..
24 గంటల్లో 43,082 కొత్త కేసులు..492 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా 40వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గురువారం దేశంలో 43,082 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా..మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల మార్కును దాటేసింది. ఎప్పటిలాగే క్రియాశీల కేసులు ఐదు లక్షలకు దిగువనే కొనసాగాయి. ప్రస్తుతం ఆ రేటు 4.89 శాతంగా ఉండగా..రివకరీ రేటు 93.65గా ఉంది. క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల రేటులో పెరుగుదల కనిపించగా, రికవరీ రేటు తగ్గుముఖం పట్టింది. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. మరోవైపు, గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 492 మంది బలయ్యారు. దాంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,35,715 మరణాలు సంభవించాయి. అలాగే, నిన్న 11,31,204 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మహారాష్ట్రలో మరోసారి వైరస్ విజృంభణ:
సుమారు నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 6,406 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్టోబర్ 22 తరవాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. పాజిటివ్ కేసుల నమోదు విషయంలో తర్వాతి స్థానాల్లో దిల్లీ(5,475), కేరళ(5,378), పశ్చిమ బెంగాల్(3,507) ఉన్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
