ప్రభుత్వ సహకారంతోనే మతమార్పిడులు: నడ్డా
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ సహకారంతోనే మతమార్పిడులు: నడ్డా

నాయుడుపేట: ఏపీలో వైకాపా సర్కార్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన భాజపా బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని నడ్డా ఆరోపించారు. 

ప్రభుత్వమే కొన్ని మతాల వారికి జీతాలు ఇవ్వడమేంటని నడ్డా ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తే వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ప్రతి వర్గం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టారని.. అందుకే ప్రజలు భాజపాకు విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని చెప్పారు. తిరుపతిలో భాజపా అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని నడ్డా కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని