దారుణహత్యలు.. జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దారుణహత్యలు.. జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఉదయం బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే. బమ్మిడి రమణ (57), బమ్మిడి ఉషారాణి (30), అల్లు రమాదేవి (53), నెకెట్లు అరుణ (37), ఉదయ్‌ (4), ఉర్విష (6నెలలు)లను బలితీసుకున్నాడు. దారుణ ఘటన గురించి తెలుసుకున్న బమ్మిడి రమణ కుమారుడు విజయ్ సాయంత్రం‌ గ్రామానికి చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుడు అప్పలరాజు ఇంటిముందు విజయ్‌తోపాటు అతడి బంధువులు ధర్నాకు దిగారు. తండ్రి, భార్య, పిల్లలు, అత్త, మేనత్తలను కోల్పోయిన తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఆగ్రహావేశాలతో అప్పలరాజు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడి కుటుంబసభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆ ఇంట్లోని సామగ్రిని విజయ్‌తో పాటు బంధువులు ధ్వంసం చేశారు. 

అప్పలరాజును చంపేయాలి: విజయ్‌

అనంతరం విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ హత్యలు చేసిన అప్పలరాజును చంపేయాలని.. అతడి కుటుంబసభ్యులనూ అరెస్ట్‌ చేయాలన్నారు. బెయిల్‌పై బయటకు రావడానికి వీల్లేని విధంగా కేసులు పెట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర హోంమంత్రి వచ్చే వరకు మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. హత్యకు గురైన తన కుటుంబసభ్యులను నిందితుడి భూమిలోనే అంత్యక్రియలు చేపట్టాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో హత్యకు గురైన తన ఇంటిలోనే వాళ్లందరినీ తగులబెట్టేస్తానని చెప్పారు. మరోవైపు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ గ్రామానికి చేరుకుని విజయ్‌తో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించామని.. బెయిల్‌కు అవకాశం లేని విధంగా నిందితుడిపై సెక్షన్లు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కచ్చితంగా కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలు తీసుకెళ్లేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని