విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు: లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 14/02/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు: లోకేశ్‌

విశాఖ: ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు లోకేశ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా సాధిస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ‘‘తెదేపా హయాంలో విశాఖకు అదాని డేటా సెంటర్‌ తీసుకువచ్చాం. వైకాపా హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకువచ్చారా? ఇక్కడ ఉన్న పరిశ్రమలను వెనక్కి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ విలువ దాదాపు రూ.2లక్షల కోట్లు. దొడ్డిదారిన ప్లాంట్‌ భూములు కొట్టేసేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు అండగా నిలబడతామని చెప్పేందుకు జగన్‌కు ధైర్యం లేదు. పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. వైకాపా నేతలు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు’’ అని లోకేశ్‌ అన్నారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇవీ చదవండి..

బెదిరింపు ఏకగ్రీవాలు ఓ విజయమేనా:లోకేశ్‌

ములకలూరులో వైకాపా శ్రేణుల రాళ్లదాడిTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని