చిత్ర హింసలు.. దారుణ హత్యలు..
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్ర హింసలు.. దారుణ హత్యలు..

గాయాలకు డీహైడ్రేషన్‌ తోడై కొందరు జవాన్ల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవిలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన జవాన్ల సంఖ్య 24కి చేరింది. 30కిపైగా మంది గాయపడ్డారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణాలతో లభించిన జవాన్లను నక్సలైట్లు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది దీన స్థితిలో మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన కొందరు జవాన్ల వద్ద లభించిన ఆయుధాలు, తుపాకులు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, బూట్లతో నక్సల్స్‌ పరారయ్యారని వివరించారు. బులెట్‌ దెబ్బలు తగిలి కదల్లేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను చేయి నరికి పాశవికంగా హత్య చేసినట్లు తెలిపారు. 

బుల్లెట్‌ గాయాలు తగిలినవారిలో కొందరు సైనికులు బతికుండేవారని.. కానీ గంటల తరబడి ఎదురుకాల్పులు జరగడంతో వారు తిండి, నీరు లేక డీహైడ్రేషన్‌కు గురై దీనస్థితిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఇతర జవాన్ల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో వారు నిస్సహాయులుగా వెనుదిరిగినట్లు తెలిపారు. 

సైనికుల మృతిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌షా దిల్లీకి తిరుగుపయనమయ్యారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, అదృశ్యమైన జవాన్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని