close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/04/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదుగురి కోసం...

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి తనవంతు కృషి చేస్తున్నారామె. చీరలు, బ్లవుజు పీసులతో మాస్కులు కుడుతూ స్థానికులకు ఉచితంగా అందజేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాన్ని ఇందుకు వినియోగిస్తున్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై వ్యక్తిగత రక్షణ బృందంలోని సభ్యురాలైన అమరేశ్వరి...
కరోనా కేసులకు ముందు అయిదు, పది రూపాయలకే లభించిన మాస్కుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో సామాన్యులకు ఇవి అందట్లేదని గ్రహించారు అమరేశ్వరి. తనవంతుగా చుట్టూ ఉన్నవారికి సాయం చేయాలనుకునే ఉద్దేశంతో మాస్కులను తయారుచేసి కొనుక్కోలేనివారికి ఇవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వాళ్ల అమ్మ నుంచి మిషన్‌ కుట్టడం నేర్చుకున్నారు. ‘నాకు రోజు విడిచి రోజు డ్యూటీ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న సమయంలో మాస్కులు కుడుతున్నా. అమ్మ కొత్త చీరలను ముక్కలుగా కత్తిరించి ఇస్తుంది. వాటితో నేను మాస్కులు తయారుచేస్తున్నా. రోజూ 200 నుంచి 250 మాస్కులను రూపొందిస్తున్నా. ఇప్పటిదాకా మూడువేల మాస్కులు తయారుచేశా. పదివేల మాస్కులు కుట్టాలన్నదే నా లక్ష్యం. రోజూ అయిదారు కుటుంబాలకు... ఒక్కొక్కరికీ మూడు చొప్పున ఇస్తున్నా. ఆఫీసుకు వెళ్లి వచ్చేటప్పుడు ఎవరైనా మాస్కులు లేకుండా కనిపిస్తే.. వారికీ ఉచితంగా అందజేస్తున్నా. దీంతోపాటు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతున్నా. గవర్నర్‌ మేడం, డీజీపీ సార్‌ మాకు స్ఫూర్తి. వారి మార్గదర్శకంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనలు మాలో కలుగుతున్నాయి’ అని వివరిస్తున్నారు అమరేశ్వరి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.