సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు 
close

తాజా వార్తలు

Published : 04/02/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు 

యువ బ్యాట్స్‌మన్‌పై వాన్‌ ప్రశంసలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టు గెలిపించినప్పటి నుంచి టీమ్ఇండియా యువబ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతకుముందు పేలవ షాట్లతో అనేక సందర్భాల్లో వికెట్‌ సమర్పించుకొని తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న అతడు ఇప్పుడు అందరిచేతా శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌.. పంత్‌ బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. 

‘సెహ్వాగ్‌ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిస్తాడు. పంత్ కూడా ఆరోస్థానంలో వచ్చి అదే చేయగల సమర్థుడు. అతడు కొన్నిసార్లు పేలవమైన షాట్లు ఆడి తక్కువ స్కోరుకే ఔటైనా మ్యాచ్‌లు కూడా గెలిపించగలడు. బెన్‌స్టోక్స్‌ లాగే పంత్‌ ఆట కూడా చూడముచ్చటగా ఉంటుంది. అతడు ఆడుతుంటే నాకు చూడాలని ఉంటుంది’ అని వాన్‌ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తొలి టెస్టులో విఫలమవడంతో రెండో టెస్టు నుంచి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతడు సిడ్నీలో(97), గబ్బాలో(89*) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మరోవైపు రేపటి నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు పంత్‌ ఎంపికయ్యాడు. అయితే, స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌ కాబట్టి తుది జట్టులో అతడికి అవకాశం ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే కెప్టెన్‌ కోహ్లీ ఈ సిరీస్‌ నుంచి అందుబాటులోకి వచ్చాడు. దాంతో జట్టు యాజమాన్యం అదనపు బ్యాట్స్‌మన్‌గా పంత్‌ను తీసుకుంటుందా? లేక కీపింగ్‌లో స్పెషలిస్టు అయిన సాహాను తీసుకుంటుందా వేచి చూడాలి. 

ఇవీ చదవండి..
రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ
మా విషయాల్లో మీ జోక్యం అనవసరం: ఓజా


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని