TS: మళ్లీ అందుబాటులోకి కొవిడ్‌ ఆస్పత్రులు
close

తాజా వార్తలు

Updated : 04/04/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: మళ్లీ అందుబాటులోకి కొవిడ్‌ ఆస్పత్రులు

వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల

హైదరాబాద్‌: గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులను తిరిగి పూర్తి స్థాయి కొవిడ్‌ అస్పత్రులుగా మార్చాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ వార్డులు ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కరోనాపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఈటల సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు. వైద్యారోగ్య, పంచాయతీరాజ్, పురపాలక, పోలీస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని ఈటల చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పేషంట్ కేర్ వర్కర్స్, మందులు, ఆక్సిజన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కరోనా చికిత్సలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆక్సిజన్‌ను అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని ఈటల తెలిపారు. 22 ప్రధాన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గతంలో మాదిరిగా ఐషోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ఇంట్లో చికిత్స తీసుకునే అవకాశం లేనట్లయితే వారందరినీ ఐషోలేషన్ సెంటర్లలో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయా సెంటర్లలో 24గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో నేచర్ క్యూర్ ప్రకృతి చికిత్సాలయం, నిజామియా టీబీ ఆస్పత్రి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రులను పూర్తి స్థాయి కరోనా చికిత్స, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో ఇవన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఈటల ఆదేశించారు. హోమ్ ఐషోలేషన్‌లో ఉండేవారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్ఆర్‌నగర్‌లో ఉన్న కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు. హోమ్ ఐషోలేషన్‌లో ఉన్నవారందరికీ కరోనా మెడికల్ కిట్స్‌ అందించడంతో పాటు టెలిఫోన్ ద్వారా వైద్య సలహాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని