రెస్కోను విలీనం చేయబోం: పెద్దిరెడ్డి
close

తాజా వార్తలు

Published : 28/03/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెస్కోను విలీనం చేయబోం: పెద్దిరెడ్డి

తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పంలోని రూరల్‌ ఎలక్ట్రిక్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌(రెస్కో)ను ఎపీఎస్పీడీసీఎల్‌లో విలీనం చేయబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇస్తామన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సన్నద్ధతపై ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమైన ఆయన భారీ మెజార్టీతో గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీ పథకాలు చర్చించుకునేలా విజయం సాధిస్తామని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. 

రెస్కో స్వాధీనానికి ఏపీఎస్పీడీసీఎల్‌కు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నిన్న డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌ అమ్మకం, పంపిణీ, రిటైల్‌ లైసెన్స్‌ మినహాయింపు పొందడంలో విఫలమైందనే కారణాలు చూపుతూ రెస్కోను స్వాధీనం చేసుకునే ఏకపక్ష చర్య సరైంది కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం ఆయన లేఖ కూడా రాశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని