కల్తీ సారా కేసు.. 9మందికి మరణ శిక్ష 
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కల్తీ సారా కేసు.. 9మందికి మరణ శిక్ష 

బిహార్‌లో కోర్టు సంచలన తీర్పు

పట్నా: బిహార్‌లోని ప్రత్యేక ఎక్సైజ్‌ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో కల్తీ సారా తాగి 21మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

2016 ఆగస్టులో గోపాల్‌గంజ్‌ జిల్లా ఖర్జుర్‌బని ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాదంలో 21మంది మరణించగా.. అనేకమంది అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరు చూపును కూడా కోల్పోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 26న ఈ 13మందిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. మరణ శిక్ష పడిన ఈ తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.

ఈ ఘటన నేపథ్యంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది జూన్‌లో ముగ్గురు ఎస్సైలు సహా 21మంది పోలీసులను డిస్మిస్‌ చేసింది. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడటం బిహార్‌లో ఇదే తొలిసారి అని గోపాల్‌గంజ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవ్‌వంశ్‌ గిరి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని