‘షర్మిలను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు యత్నం’
close

తాజా వార్తలు

Published : 28/03/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘షర్మిలను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు యత్నం’

తెరాసపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ విమర్శలు‌

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం, షర్మిల కలిసి లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ కుమార్తె సురభి వాణీదేవిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారని.. అలాగే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలను ఆడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలని తెరాస ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌ను బలిపశువులను చేశారన్నారు. తెరాస నేతల ప్రయత్నాలు కాంగ్రెస్‌ను గెలిపించేలా ఉన్నాయని చెప్పారు. సుగంధద్రవ్యాల ప్రాంతీయ ఎక్స్‌టెన్షన్ బోర్డుతో పసుపునకు మంచి ధర వస్తుందని చెప్పారు. రైతులు పసుపు బోర్డే కావాలంటే కేంద్రంతో తాను మాట్లాడుతానని.. ఒత్తిడి తీసుకొచ్చి బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని