close

తాజా వార్తలు

Updated : 09/08/2020 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్ని ప్రమాదంపై జగన్‌కు మోదీ ఫోన్‌..

అమరావతి :విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేశారు. అగ్ని ప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం తెలిపారు. హోటల్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని వివరించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడ్డారన్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.