‘నాపై సీఎం బాబాయి, మంత్రి కలిసి కుట్ర’
close

తాజా వార్తలు

Published : 02/03/2021 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నాపై సీఎం బాబాయి, మంత్రి కలిసి కుట్ర’

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఎంపీగా తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లాలనుకుంటే తమ పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని వైకాపా ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు విమర్శించారు. హిందూ దళితులు, క్రైస్తవ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నానని ఒకే రోజు ఒకే సమయంలో తనపై పదికిపైగా కేసులు మోపారని ఆయన ఆరోపించారు. క్రైస్తవంలో దళితులు ఉండరన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధానమంత్రిని కోరితే తనపై కేసులు మోపుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాబాయ్, తమ జిల్లా మంత్రి రంగనాథరాజు కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో తాడేపల్లి పెద్దలున్నారనే అనుమానం తనకు కలుగుతోందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై సభాపతికి ఫిర్యాదు చేశానని, వారికి ప్రివిలేజ్‌ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. ఒక కులానికి అనుకూలంగా మాట్లాడినందున ఏయూ ఉప కులపతిని ఆ పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. తితిదే ఛైర్మన్‌ తన సిఫార్సులను తిరస్కరిస్తున్నారని, ఎంపీగా తనకున్న హక్కులను కాలరాయడానికి తితిదే ఛైర్మన్‌ ఎవరని ఆయన ప్రశ్నించారు. తనపై రాష్ట్రంలో సాగుతున్న కుట్రలను ప్రధాని దృష్టికి తీసుకువెళతానని రఘురామ కృష్ణరాజు చెప్పారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని