AP News:చిట్టీ...ఒక దోశ..

తాజా వార్తలు

Published : 28/07/2021 00:31 IST

AP News:చిట్టీ...ఒక దోశ..

అమరావతి: చిట్టి చిట్టి రోబోలు ఎంచక్కా అందరితో జట్టు కట్టేస్తున్నాయి. మనస్సు దోచేలా ఆత్మీయంగా వడ్డించేస్తున్నాయి. భోజనప్రియులకు కావాల్సిన ఆహారం తెచ్చి ఇస్తున్న రోబోటిక్ సర్వీస్ విజయవాడలో ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.

సాంకేతిక హంగులతో రోబోటిక్‌ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలను సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రధాన నగరాలకే మాత్రమే పరిమితమయిన రోబో రెస్టారెంట్లు రాష్ట్రంలోనూ క్రమేణా పెరుగుతున్నాయి. విజయవాడలోని ఓ రెస్టారెంట్లో కొత్తగా ప్రవేశ పెట్టిన రోబోలు వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. లోనికి వచ్చే అతిథులకు స్వాగతం పలకడం, సిద్ధం చేసిన ఆహారాన్ని నేరుగా వారి టేబుల్‌ వద్దకు తీసుకెళ్లి అందించడం వంటి సేవలు చిన్నారులతో పాటు, పెద్దలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి. 

విజయవాడతో పాటు ఒంగోలు, రాజమండ్రి రెస్టారెంట్లలో ప్రయోగాత్మకంగా రోబో సేవలు మొదలయ్యాయి. ఒక్కో రోబో ఖరీదు ఆరు లక్షల వరకూ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ రోబోలు కిచెన్‌లో తయారైన వంటకాలను నేరుగా వినియోగ దారుల టేబుల్‌ వద్దకు చేరుస్తున్నాయి. భోజనప్రియులను ఆకట్టుకుంటున్న ఈ రోబోలు పుడ్‌ సెర్వింగ్‌లో వినియోగదారులకు కావాల్సిన ఆహారాన్ని నేరుగా వాటికే చెప్పుకునే వెసులుబాటు ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే సదుపాయమే వాడుకలో ఉంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని