Assam సీఎంపై తేలని సందిగ్ధత
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Assam సీఎంపై తేలని సందిగ్ధత

దిల్లీ వెళ్లిన శర్వానంద, హిమంత

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ భాజపా వరుసగా రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది కాషాయ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు మాజీ సీఎం శర్వానంద సోనోవాల్‌, పార్టీ మరో ప్రముఖ నేత హిమంత విశ్వ శర్మలకు భాజపా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరిద్దరూ ఈ ఉదయం దిల్లీ చేరుకున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు సోనోవాల్‌, శర్మ ఈ ఉదయం దిల్లీ చేరుకున్నట్లు అస్సాం భాజపా అధికార ప్రతినిధి రూపమ్‌ గోస్వామి తెలిపారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా ప్రధాన కార్యదర్శి సంతోష్‌లతో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

2016 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో శర్వానంద సోనోవాల్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల ఆయనపై రాష్ట్ర ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపులో హిమంత విశ్వ శర్మ కీలక పాత్ర పోషించారు. బోడోలాండ్‌లో యూపీపీఎల్‌ పార్టీతో పొత్తు కుదుర్చింది హిమంతనే. దీంతో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో భాజపా 60 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్‌ 9, యూపీపీఎల్‌ 6 స్థానాల్లో గెలిచాయి. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని