సర్వర్‌ డౌన్‌: Covidపై సుప్రీం విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Published : 10/05/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్వర్‌ డౌన్‌: Covidపై సుప్రీం విచారణ వాయిదా

దిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులపై సర్వోన్నత న్యాయస్థానం చేపట్టిన విచారణ సాంకేతిక సమస్య కారణంగా వాయిదా పడింది. కొవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్‌ విధానం తదితర అంశాలపై సుప్రీంకోర్టులో సుమోటోగా కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. అయితే సాంకేతిక లోపం వల్ల వాదనలకు పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

‘‘ఈ రోజు సర్వర్‌ డౌన్‌ అయ్యింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను మేం పరిశీలిస్తాం. దీనిపై తదుపరి విచారణను గురువారానికి(మే 13) వాయిదా వేస్తున్నాం’’ అని జస్టిస్‌ రవీంద్ర భట్‌ తెలిపారు. కొవిడ్ సంబంధిత అంశాలపై సుప్రీం సుమోటో కేసుతో పాటు దాదాపు 20 ఇతర పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని కూడా ఆ రోజే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

వ్యాక్సిన్‌ విధానం, కొవిడ్‌ నిర్వహణపై కేంద్రం నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిపుణులు, శాస్త్రీయ సలహాలతోనే టీకా విధానాన్ని రూపొందించామన్న కేంద్రం.. ప్రజాప్రయోజన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని