close

తాజా వార్తలు

Published : 02/05/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

SRH కఠిన నిర్ణయం: వార్నర్‌పై వేటు

మిగిలిన సీజన్‌కు కెప్టెన్‌గా విలియమ్సన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై వేటు వేసింది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక మిగిలిన సీజన్‌కూ అతడే నాయకత్వం వహిస్తాడని స్పష్టం చేసింది. ఈ పోరులో తమ విదేశీ బృంద కూర్పులో మార్పులు ఉంటాయని తెలిపింది.

తాజా సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఆఖర్లో బోల్తా పడుతోంది. దూకుడుగా ఆడే డేవిడ్‌ వార్నర్‌ సైతం ఫామ్‌లో లేడు. బంతికో పరుగు చొప్పున చేస్తున్నాడు. ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచుల్లో అర్ధశతకాలతో రాణించాడు. అతడి సారథ్యంపైనా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

డేవిడ్‌ వార్నర్‌ను సారథ్యం నుంచి తప్పించే నిర్ణయం తాము సులభంగా తీసుకోలేదని సన్‌రైజర్స్‌ తెలిపింది. కొన్నేళ్లుగా అతడు సాధించిన విజయాలు, చూపిన ప్రభావాన్ని తేలిగ్గా తీసుకోలేదని వెల్లడించింది. మిగిలిన సీజన్లో మైదానం లోపల, బయట విజయవంతం అయ్యేందుకు  వార్నర్‌ సహకారం కొనసాగిస్తాడని ఆశించింది. విదేశీ ఆటగాళ్ల కూర్పులో మార్పులుంటాయని చెప్పిన ఆ ఫ్రాంచైజీ మాటలను చూస్తుంటే మిగిలిన సీజన్లో వార్నర్‌కు తుది జట్టులో చోటు కష్టమే అనిపిస్తోంది!

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని