ముందంజలో స్టాలిన్‌.. ఆధిక్యంలో డీఎంకే
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముందంజలో స్టాలిన్‌.. ఆధిక్యంలో డీఎంకే

చెన్నై: తమిళనాడులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఫలితాత సరళిలో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండగా.. అధికార అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం నుంచి ఆయనొక్కరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

డీఎంకే కూటమి 115 స్థానాల్లో ముందంజలో ఉండగా.. అన్నా డీఎంకే కూటమి 72 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఏఏఎంకేకు చెందిన టీటీవీ దినకరన్‌ కొవిల్‌పట్టి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో సీఎం పళని స్వామి, బోడినాయక్కనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ముందంజలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌ ముగిసే సరికి స్టాలిన్‌ కొలతూర్‌ నియోజకవర్గం నుంచి 1,754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్‌ మార్కు 118 స్థానాల్లో విజయం సాధించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని