close

తాజా వార్తలు

Published : 25/02/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

TS: అంతంత మాత్రంగానే విద్యార్థుల హాజరు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండో రోజు కూడా విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే నమోదైంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిన్న 9శాతం హాజరు నమోదు కాగా.. ఇవాళ స్వల్పంగా పెరిగి 14 శాతం విద్యార్థులు బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 17శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 14శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ప్రభుత్వ బడుల్లో 5,47,479 మంది విద్యార్థులకు గాను 94,244 మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో 7,57,319 మందికిగాను 1,02,831 మంది విద్యార్థులు హాజరయ్యారు. అత్యధికంగా నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో 28 శాతం హాజరుకాగా.. అత్యల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాల్లో 5శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని