AP News: మహిళను పెళ్లి చేసుకోవడానికి హిజ్రాగా మారిన యువతి

తాజా వార్తలు

Updated : 24/07/2021 08:20 IST

AP News: మహిళను పెళ్లి చేసుకోవడానికి హిజ్రాగా మారిన యువతి

న్యాయం చేయాలని పోలీసులకు విన్నపం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో యువతి హిజ్రాగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమైంది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు. యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పిడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, న్యాయం చేయాలని యువతి పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని