IPL బాటలోనే ఒలింపిక్స్‌!
close

తాజా వార్తలు

Published : 05/05/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL బాటలోనే ఒలింపిక్స్‌!

కొవిడ్‌ అత్యయిక స్థితి పొడగింపే కారణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి సామూహిక క్రీడలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఎక్కువ జట్లు, ఎక్కువ క్రీడాకారులు, ఎక్కువ సిబ్బంది పాల్గొనే టోర్నీలను సవ్యంగా సాగనివ్వడం లేదు. పాజిటివ్ కేసులు రావడంతో ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఒలింపిక్స్‌కు సైతం ముప్పు తప్పేలా లేదు. బహుశా మెగా క్రీడలు సైతం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవంగా ఒలింపిక్స్‌ గతేడాదే జరగాలి. వైరస్‌ కారణంగానే వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులైలో నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌ నగరాల్లో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం కరోనా అత్యయిక స్థితిని పొడగించనుందని సమాచారం. కేసులు పెరగడంతో క్రీడలు జరగాల్సిన టోక్యో, ఒసాక, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో మే 11 వరకు అత్యయిక స్థితిని పొడగిస్తారని స్థానిక మీడియాలో  వార్తలు వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఒలింపిక్స్‌కు అభిమానులను అనుమతించాలా.. వద్దా? అన్న విషయంపై అక్కడి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.  ఈ నెలలోనే నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆ నిర్ణయాన్ని జూన్‌కు వాయిదా వేశారని తెలిసింది. జపాన్‌లో కరోనా అత్యయిక స్థితి పొడగింపు నిర్ణయం తీసుకొనేందుకు ప్రధాని యోషిహిడె సుగా సీనియర్‌ మంత్రులు, అధికారులతో బుధవారం చర్చించనున్నారు. అత్యయిక స్థితిలో మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, థియేటర్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌, క్రీడా మైదానాలను మూసివేస్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని