close

తాజా వార్తలు

Updated : 06/03/2021 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. మార్స్‌పై రోవర్‌ ‘టెస్ట్‌ డ్రైవ్‌’.. అద్భుతం!

అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ మరో కీలక ముందడుగు సాధించింది. అంగారక గ్రహంపై తొలిసారి విజయవంతంగా ‘టెస్ట్‌ డ్రైవ్‌’ చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా శుక్రవారం వెల్లడించింది. ‘ఆరు చక్రాలు కలిగిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అంగారకుడిపై విజయవంతంగా ప్రయాణం (టెస్ట్‌ డ్రైవ్‌) చేసింది. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్ల (21.3ఫీట్‌) దూరం ప్రయాణించింది. నాలుగు మీటర్లు ముందుకు ప్రయాణించి.. 150 డిగ్రీల ఎడమవైపునకు  తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించింది’ అని నాసా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మళ్లీ కలవరపెడుతున్న కరోనా 

దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల కంగారు పుట్టిస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి.. మళ్లీ కొన్నివారాలుగా విజృంభిస్తోంది. 20వేలకు చేరువగా పాటిజివ్ కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 7,51,935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,327 కొత్త కేసులు వెలుగుచూశాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో రోజు కూడా మరణాల సంఖ్య వంద దాటింది. తాజాగా 108 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొత్తరకం కరోనా.. ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

3. వాటిపై మోదీ ఫొటో తొలగించండి

ఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్‌ ధ్రువీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉండటాన్ని తప్పుబడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్‌ నిబంధనలను పాటించాలని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో టీకా ధ్రువపత్రాలపై ప్రధాని ఫొటోను తొలగించాలని ఈసీ కేంద్రాన్ని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖకు ఈసీ లేఖ రాసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గెలుపు తెదేపాదే: ఇది జగన్‌ పాలనకు రెఫరెండం

విజయవాడ నగరపాలిక ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. తొలిసారి తమ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ వైకాపా ఉవ్విళ్లూరుతోంది. రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఆ పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంపై సీఎం జగన్‌ కక్ష పెట్టుకున్నారని ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. తెదేపాలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటున్న కేశినేని నానితో ప్రత్యేక ముఖాముఖి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* మద్యాన్ని అడ్డుపెట్టి రూ.50వేల కోట్ల అప్పు

5. ఒత్తిడి వల్ల చర్మ సమస్యలొస్తాయ్‌!

ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికి తెలిసిందే. ఒత్తడి ఉంటే తలనొప్పి, రక్తపోటు వంటివి వస్తాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవే కాదు.. ఒత్తిడి వల్ల చర్మానికి అనేక సమస్యలు తలెత్తుతాయట. ఒత్తిడితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, దాని కారణంగానే మొటిమలు, దద్దుర్లు రావడం.. జట్టు సన్నబడటం, రాలిపోవడం, ఇతర చర్మ సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మూత్రపిండాలు బాగుండాలంటే..!

6. ఐటీ సోదాలు.. తాప్సీ ఏమన్నారంటే..

తన నివాసంలో ఆదాయపన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పారు. వీటిపై ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ. ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తమిళనాట 20 స్థానాల్లో భాజపా బరిలోకి!

తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, అన్నాడీఎంకేల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తులో భాగంగా భాజపాకు అధికార అన్నాడీఎంకే 20 స్థానాలు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు పార్టీల సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు.  అన్నాడీఎంకే తరపున పార్టీ కోఆర్డినేటర్‌, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, సీఎం ఈ పళనిస్వామి, భాజపా తరపున రాష్ట్ర ఇన్‌ఛార్జి సీటీ రవి, స్టేట్‌ యూనిట్‌ చీఫ్‌ మురుగన్‌ సంతకం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టీమ్‌ఇండియా 365 ఆలౌట్‌

వాషింగ్టన్‌ సుందర్‌(96*; 174 బంతుల్లో 10x4, 1x6), అక్షర్‌ పటేల్‌(43; 97 బంతుల్లో 5x4, 1x6) రాణించడంతో టీమ్‌ఇండియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. చివర్లో అక్షర్‌, ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌ వరుసగా ఔటవ్వడంతో.. సుందర్‌ త్రుటిలో తొలి టెస్టు శతకాన్ని కోల్పోయాడు. 294/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన అక్షర్‌, వాషింగ్టన్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ శతక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 160 పరుగులకు చేరవేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భారత్‌ x ఇంగ్లాండ్‌: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

9. నాలుక కరుచుకొని.. డిలీట్‌ చేయక్కర్లేదు

ట్వీట్‌ చేయడం అంటే.. పెన్నుతో రాయడం లాంటిదే. పెన్నుతో రాసింది ఎలా మార్చడం వీలుపడదో..  ట్వీటును ఎడిట్‌ చేయడం కూడా అస్సలు కుదరదు. కావాలంటే ఆ ట్వీటును డిలీట్‌ చేసి మళ్లీ కొత్తగా ట్వీటాల్సిందే. దీంతో చాలా రోజుల నుంచి ట్వీట్లను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యం ఇవ్వాలంటూ నెటిజన్లు అడుగుతున్నా... ఆ దిశగా ట్విటర్‌ పెద్దలు ఆలోచించడం లేదు. దీంతో ట్వీటులో తప్పులు వస్తే.. నాలుక కరుచుకొని డిలీట్‌ చేయడం తప్ప వేరే ఆప్షన్‌ లేకుండా పోయింది. అయితే ట్వీటు సెండ్‌ అయ్యేలోపు... క్యాన్సిల్‌ చేసుకునే ఆప్షన్‌ ఇస్తారట. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చిందని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌లో పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌

మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌ రోడ్లపై ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్‌ డెక్కర్‌ బస్సులతో పోలిస్తే సాంకేతిక పరంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్‌, హైదరాబాద్‌ రోడ్లకు అనువైన బస్సు బాడీ వంటివి ఉండాలని ఆర్టీసీ సంస్థ టెండర్‌ దాఖలు సమయంలోనే స్పష్టం చేసింది. ఇటీవల టెండర్లలో పాల్గొన్న అశోక్‌ లేలాండ్‌.. ఆర్టీసీ కోరినట్లు బస్సులను సమకూరుస్తామని చెప్పింది. మొదటి దశలో 25 బస్సులు కావాలని కోరగా అదే విధంగా అందజేస్తామని సంస్థ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని