తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల
close

తాజా వార్తలు

Updated : 18/06/2020 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. రెండు సంవత్సరాలకు కలిసి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ తొలి సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 60.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వివరించారు. 67.47 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 52.30 శాతం మంది పాసయ్యారని తెలిపారు.

రెండో సంవత్సర ఫలితాల్లో 2,83,462 మంది ఉత్తీర్ణత సాధించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 68.86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. 75.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలుర ఉత్తీర్ణత శాతం 62.10గా నమోదైందని వెల్లడించారు. తొలి సంవత్సర ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. రెండో సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీమ్‌ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని