పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
close

తాజా వార్తలు

Published : 02/01/2021 19:22 IST

పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్‌ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు, ఏపీకి 1,600 బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఎంజీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషస్, సెంట్రల్‌ బస్ స్టేషన్‌ (సీబీఎస్‌), ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణాల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు. అంతే కాకుండా జంట నగరాల పరిధిలోని శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వరప్రసాద్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. పండుగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా www.tsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు వరప్రసాద్‌ తెలిపారు.

ఇవీ చదవండి..
అశోక్‌ గజపతికి ధర్మకర్త హోదా తొలగింపు

వరంగల్‌లో కాంగ్రెస్‌ నేతల పర్యటన ఉద్రిక్తం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని