సెప్టిక్‌ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి 
close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెప్టిక్‌ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి 

మేడిపల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్‌ట్యాంకు తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మేడిపల్లికి చెందిన ఓల్పుల జలంధర్‌ కుమారుడు అశ్వంత్‌ (5), అతడి సోదరి కూతురు డబ్బేటి రుతిక (7) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు చిన్నారులు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతకగా, ఇంటి సమీపంలోని సెప్టిక్‌ట్యాంక్‌ తొట్టిలో చిన్నారులిద్దరూ ప్రాణాపాయస్థితిలో కనిపించారు. వెంటనే వారిని జగిత్యాల ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన రుతిక మేడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి రాఖీ పండుగకు వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని