యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌పై కేసు నమోదు
close

తాజా వార్తలు

Updated : 28/02/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌పై కేసు నమోదు

హైదరాబాద్: మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ వేగంగా వచ్చి మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని జర్నలిస్టు కాలనీ హుడా హైట్స్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా అతనికి 170 రీడింగ్ చూపించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో తన మిత్రుడితో కలిసి కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. షణ్ముఖ్‌, తనతో కారులో ఉన్న అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని