Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120916
            [news_title_telugu_html] => 

‘కుమార’ పాలనకు కుదుపు!

[news_title_telugu] => ‘కుమార’ పాలనకు కుదుపు! [news_title_english] => [news_short_description] => సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. కలిసి పోటీ చేసినా కేవలం ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/4irCccXF6Fs [news_videoinfo] => https://www.youtube.com/embed/4irCccXF6Fs [news_sections] => ,27,26, ) )
‘కుమార’ పాలనకు కుదుపు! - EENADU
close
‘కుమార’ పాలనకు కుదుపు!

కర్ణాటకలో ఫలితాల ప్రభావం
రాజీనామాకు సిద్ధమన్న సీఎం
కలసి సాగుదామన్న కాంగ్రెస్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. కలిసి పోటీ చేసినా కేవలం ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల నాయకులు శుక్రవారం సుదీర్ఘ సమావేశాలతో తలమునకలయ్యారు. ఓటమికి కారణాలపై విశ్లేషించుకున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావుతో పాటు మంత్రులతోనూ ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు.

రాజీనామాకు సిద్ధమంటూ రాహుల్‌కి ఫోన్‌...
ప్రత్యర్థికన్నా మిత్రపక్షం కాంగ్రెస్‌ సహకారం లేక, నిత్యం తగవులాడుకోవటం వల్లనే ఇంతటి ఓటమి దాపురించిందని సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మీ ప్రవర్తన మార్చుకోకుంటే నేనిప్పుడే రాజీనామా చేస్తా’నని తెగేసి చెప్పారు. కాంగ్రెస్‌ నేతల్లో ఎవరైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటే తామంతా మద్దతిస్తామంటూ రాహుల్‌గాంధీకి ఫోన్‌చేసి చెప్పారు. ఫలితాల తర్వాత ఇలాంటి నిర్ణయం సరికాదని, రానున్న నాలుగేళ్ల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ రాహుల్‌గాంధీ ఆయనను ఊరడించారు. అనంతర పరిణామాల్లో రాష్ట్ర నాయకులూ ఇదే హామీతో కుమారస్వామికి మద్దతుపలికారు. కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలను ఆర్పే బాధ్యత మీరే తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలంటూ రాహుల్‌కు కుమార సూచించారు. మరోవైపు ఓటమిపై మాజీ ప్రధాని దేవేగౌడ పలువురు నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

అతి త్వరలో కొత్త యోచన: యడ్యూరప్ప
‘కన్నడనాట ఇంతటి భారీ పరాభవం తరువాత జనతాదళ్‌ నేతలు కాంగ్రెస్‌తో కలసి సాగాలా? వద్దా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోవటం వారి విజ్ఞతకు సంబంధించిన అంశం. మరో రెండు రోజుల వరకు వేచిచూసి తర్వాత మా పార్టీ ఆలోచనను బయటపెడతాం’ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హెచ్చరించడం కర్ణాటకలో మరో తాజా పరిణామం.

తాతగారి పోటీకి వీలుగా రాజీనామా చేస్తా: ప్రజ్వల్‌
జనతాదళ్‌ అధినేత దేవేగౌడ పరాజయం ఆయన కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. ఆయన సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న హాసనను మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు అప్పగించి తుమకూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నిజానికి ఇదే తనకు ఆఖరు పోటీ అని ప్రకటించినా ఓటర్లు గౌడను ఆదరించలేదు. హాసనలో నెగ్గిన ప్రజ్వల్‌ రేవణ్ణ స్పందిస్తూ ‘తాతగారి ఓటమిని భరించలేను. ఆయన పోటీకి వీలుగా రాజీనామా చేస్తా’నని ప్రకటించారు. ప్రజ్వల్‌ ప్రతిపాదనకు దేవేగౌడ ఇంకా ప్రతిస్పందించలేదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.