Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120996
            [news_title_telugu_html] => 

కారుకు తగ్గాయ్‌.. కమలానికి పెరిగాయ్‌..!

[news_title_telugu] => కారుకు తగ్గాయ్‌.. కమలానికి పెరిగాయ్‌..! [news_title_english] => [news_short_description] => రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో తెరాస నెగ్గిన కొన్ని చోట్ల ఈసారి ఇతర పార్టీలు ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
కారుకు తగ్గాయ్‌.. కమలానికి పెరిగాయ్‌..! - EENADU
close
కారుకు తగ్గాయ్‌.. కమలానికి పెరిగాయ్‌..!

శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 17 స్థానాల్లో తెరాస వెనుకంజ
20 స్థానాల్లో భాజపా ముందంజ
రెండు స్థానాలను మెరుగుపరుచుకున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో తెరాస నెగ్గిన కొన్ని చోట్ల ఈసారి ఇతర పార్టీలు ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గిన అన్ని స్థానాల్లోనూ ఈ సారి తెరాస ఆధిక్యతను సాధించింది. శాసనసభ ఎన్నికల్లో తెరాసకు మంచి ఫలితాలందించిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈసారి భాజపా విజయం సాధించింది. వీటిలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తెరాస కన్నా భాజపాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తెరాస 71, కాంగ్రెస్‌ 21, భాజపా 21, ఎంఐఎం 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల నాటి బలాలతో పోలిస్తే 17 స్థానాల్లో తెరాస బలం తగ్గగా భాజపా 20 స్థానాల్లో, కాంగ్రెస్‌ 2 చోట్ల పుంజుకున్నాయి.
*  ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ను తెరాస దక్కించుకోగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌లో తెరాస ఆధిక్యత సాధించగా ప్రస్తుతం భాజపా మెజారిటీ సాధించింది.
*  నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించగా ప్రస్తుతం ఆర్మూరు, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపా ఎక్కువ ఓట్లు సాధించింది.
*  జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ విజయం సాధించగా మిగతా అన్నింటిని తెరాస కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో జహీరాబాద్‌, ఎల్లారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో తెరాస ఆధిక్యత సాధించింది.
*  వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి మినహా అన్ని సెగ్మెంట్లను తెరాస గెలుచుకోగా ఈ ఎన్నికల్లో అన్నింటిలో తెరాసనే ఆధిక్యత సాధించింది.
*  పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి, మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించగా ప్రస్తుతం ఆ సెగ్మెంట్లు మినహా అన్నింటా తెరాస ఆధిక్యతను కనబరిచింది.
*  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిలో తెరాస ఆధిక్యం సాధించగా ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, మక్తల్‌ సెగ్మెంట్లలో భాజపా పైచేయిగా నిలిచింది.
*  నల్గొండ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌్ మినహా అన్ని నియోజకవర్గాల్లో తెరాస విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ తన ఆధిక్యతను చాటింది.
*  ఖమ్మం లోక్‌సభ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో పాలేరు, మధిర, కొత్తగూడెంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. వైరాలో స్వతంత్ర అభ్యర్థి, సత్తుపల్లి, అశ్వరావుపేటలో తెలుగుదేశం గెలుపొందాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఏడు స్థానాల్లోనూ తెరాస అత్యధిక ఓట్లను సాధించింది.
*  కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని స్థానాలను శాసనసభ ఎన్నికల్లో తెరాస గెలుచుకోగా ప్రస్తుతం కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు స్థానాల్లో భాజపా ఆధిక్యతను సాధించింది.
*  మెదక్‌ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి స్థానం మినహా మిగతా సెగ్మెంట్లలో తెరాస విజయం సాధించగా ప్రస్తుతం ఆ స్థానంలోనూ తెరాస ప్రాబల్యం చాటింది.
*  చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ ఎన్నికల్లో తాండూరు, మహేశ్వరం స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవగా మిగతా స్థానాలను తెరాస గెలుచుకుంది. ప్రస్తుతం చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యతను చాటింది. మహేశ్వరంలో తెరాస ప్రాబల్యం ప్రదర్శించింది.
*  నాగర్‌కర్నూలు లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ను కాంగ్రెస్‌ సొంతం చేసుకోగా ఈ సారి దీంతోపాటు అన్నిచోట్లా తెరాసయే ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
*  భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లలో తెరాస ఆధిక్యత ప్రదర్శించగా ప్రస్తుతం కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని సాధించింది.
*  మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ ఎన్నికల్లో ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలంను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈసారి ఈ నాలుగుచోట్లా తెరాస ఆధిక్యతను సాధించింది.
*  మల్కాజిగరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగరి, ఉప్పల్‌ స్థానాల్లో తెరాస విజయం సాధించగా ప్రస్తుతం ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కు అధిక ఓట్లు లభించాయి.
*  సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి స్థానంలో ఎంఐఎం విజయం సాధించగా ప్రస్తుతం తెరాస ఆధిక్యాన్ని చూపింది. ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌ స్థానాల్లో తెరాస విజయం సాధించగా ప్రస్తుతం వాటిలో భాజపా ఆధిక్యతను ప్రదర్శించింది.

తెరాసకు ఆధిక్యత లభించిన స్థానాలు(71)

సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, జుక్కల్‌, బాన్స్‌వాడ, కామారెడ్డి, నారాయణఖేడ్‌, అందోలు, కంటోన్మెంట్‌, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌, హుజూరాబాద్‌, సిరిసిల్ల, హుస్నాబాద్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, తాండూరు, కొల్లాపూర్‌, వనపర్తి, గద్వాల, అలంపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, తుంగతుర్తి, జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట, డోర్నకల్‌, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొడంగల్‌, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, షాద్‌నగర్‌, సూర్యాపేట, నల్గొండ, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తి, పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట

కాంగ్రెస్‌ (21)
రామగుండం, మంథని, ఖానాపూర్‌, ఎల్లారెడ్డి, జహీరాబాద్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, మునుగోడు, భువనగిరి, నకిరేకల్‌, ఆలేరు, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ

భాజపా (21) 
ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, గోషామహల్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, మహబూబ్‌నగర్‌, మక్తల్‌

ఎంఐఎం (6)
మలక్‌పేట్‌, కార్వాన్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, బహదూర్‌పుర

మారిన ఓట్ల శాతాలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలతో పోలిస్తే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో మార్పు చోటుచేసుకుంది. ముఖ్యంగా తెరాసకు అప్పటి కంటే ఓట్ల శాతం తగ్గగా.. భాజపాకు గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతంలోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 62.25 శాతం పోలింగ్‌ నమోదైంది. గతేడాది డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 62.69 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల(2014)తో పోల్చితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ మూడు పార్టీలకూ గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. అయినా తెరాసకు గత ఎన్నికలతో పోల్చితే రెండు సీట్లు తగ్గాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.