Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 140790
            [news_title_telugu_html] => 

రింగురోడ్డులో కొత్త మెలిక 

[news_title_telugu] => రింగురోడ్డులో కొత్త మెలిక  [news_title_english] => [news_short_description] => ప్రాంతీయ రింగురోడ్డు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీనికయ్యే నిర్మాణ వ్యయంపై మళ్లీ అధ్యయనం... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,27,26, ) )
రింగురోడ్డులో కొత్త మెలిక  - EENADU
close
రింగురోడ్డులో కొత్త మెలిక 

ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణ వ్యయంపై మళ్లీ అధ్యయనం చేయాలని కేంద్రం సూచన 
పెట్టుబడిపై వడ్డీ కూడా రాదేమోనని అనుమానం 
30 ఏళ్లు టోల్‌ వసూలు చేసినా సరిపోదని అంచనా 
ఈనాడు - హైదరాబాద్‌

ప్రాంతీయ రింగురోడ్డు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీనికయ్యే నిర్మాణ వ్యయంపై మళ్లీ అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు ఎంత వరకు ఆర్థిక సానుకూలత (ఫైనాన్షియల్‌ వయబిలిటీ) ఉంటుందో అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సూచించింది. 30 సంవత్సరాల పాటు టోల్‌ వసూలు చేసినా ఆ సొమ్ము ఈ మార్గాన్ని నిర్మించేందుకు పెట్టే పెట్టుబడిపై వడ్డీకి కూడా సరిపోదని కేంద్రం అంచనా వేస్తోంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు వెలుపల నుంచి 340 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు గతంలో కేంద్రం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఇందులో కొంత భాగానికి జాతీయ రహదారుల సంఖ్య కేటాయించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి యుధ్‌వీర్‌ సింగ్‌ మాలిక్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఎంత వరకు సానుకూలమన్న అంశంపై చర్చించిన అనంతరం మరోసారి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రానికి స్పష్టం చేశారు. 
రూ. 12,000 కోట్ల వ్యయం 
ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ. 12,000 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. భూ సేకరణకు అయ్యే రూ.3,000 కోట్లలో సగం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వ సిద్ధపడింది. దాన్ని 120 మీటర్ల వెడల్పున నిర్మించాలన్నది ప్రతిపాదన. సుమారు రూ. 12,355 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తొలుత 4 వరుసల మార్గాన్ని నిర్మించి, భవిష్యత్తులో అవసరమైతే మరో 4 వరుసలు విస్తరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా ఉంది. 
వడ్డీ కూడా వసూలు కాదు 
ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 10,500 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ అంచనా ప్రకారం టోల్‌గేట్లు ఏర్పాటు చేసినా ఆ రుణానికి చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా వసూలయ్యే అవకాశాలు కనిపించటం లేదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మార్గం నిర్వహణ, పెట్టుబడి అసలు తీర్చటం ఎలా అన్న అంశంపై కూడా తర్జనభర్జనలు సాగాయి. పెట్టుబడి రాబట్టుకునేందుకు ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర అధికారులను కేంద్రం కోరింది. విలువ సంగ్రహణ విధానం (వాల్యూ క్యాప్చర్‌ మెకానిజం) ద్వారా పరిసరాల్లో సదుపాయాలను వృద్ధి చేయటం ద్వారా పెట్టుబడి వ్యయంలో కనీసం సగం మొత్తాన్ని రాబట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కేంద్రం సూచించింది. వడ్డీ మొత్తాన్ని టోల్‌గేట్ల రూపంలో రాబట్టుకునే అవకాశం ఉండాలి. 
మీరైనా కట్టుకోవచ్చు 
ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవచ్చని లేదా విలువ సంగ్రహ విధానం ద్వారా పెట్టుబడి వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించవచ్చని కేంద్రం పేర్కొంది. 500 మీటర్ల వెడల్పు మేరకు భూ సేకరణ చేసి మిగిలిన మొత్తాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చుకోవచ్చని సూచించింది. ఎంతకాలంలో పెట్టుబడిని వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుందో పరిశీలించాలని కోరింది. ప్రాజెక్టు ఆర్థిక వెసులుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇస్తే అప్పుడు ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో బంతి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి చేరింది. సర్కారు ఏ విధంగా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాలి. ప్రాంతీయ రింగురోడ్డులోని ఉత్తర భాగంలో పలు ప్రాంతాల్లో హైటెన్షన్‌ వైర్లు వెళ్తున్న దృష్ట్యా వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసే సమయానికి పర్యావరణ, అటవీ అనుమతులను పొంది ఉండాలి. వినిమయ వస్తువుల తరలింపు, నిర్మాణానికి ముందు చేపట్టాల్సిన పనులకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

ప్రాంతీయ వలయ రహదారి స్వరూపం


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.